
‘ప్రేమలు’ వంటి సూపర్‌హిట్ తర్వాత దర్శకుడు గిరీష్ ఏ.డి. తెరకెక్కించిన చిత్రం ‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’. నివిన్ పౌలీ హీరోగా నటించిన ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందింది. ఓనం సందర్భంగా నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది.
సినిమా ప్రారంభం నుంచే దర్శకుడు కథను క్లీన్‌గా, ఫన్ అండ్ రొమాంటిక్ మూడ్‌లో నడిపించినట్లు ప్రేక్షకుల స్పందన చెబుతోంది. గిరీష్ ఏ.డి. రాసుకున్న వన్‌లైన్ పంచులు, కామెడీ సన్నివేశాలు బాగా పేలాయని టాక్. కథకు అనుగుణంగా స్క్రీన్‌ప్లేను నడిపించిన తీరు, నటీనటుల కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
నివిన్-మమిత కెమిస్ట్రీ హైలైట్
నివిన్ పౌలీ, మమితా బైజు మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. కథలో అక్కడక్కడా వచ్చే క్యూట్ మూమెంట్స్, రొమాంటిక్ సన్నివేశాలు సినిమాకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. విష్ణు విజయ్ అందించిన సంగీతం, పాటలు కూడా ఫస్టాఫ్‌కు ప్లస్‌గా నిలిచాయి.
క్యూట్ ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. దీంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది.
క్లైమాక్స్‌తో మళ్లీ పుంజుకున్న కథ
సెకండాఫ్ ప్రారంభంలో కథనం కొంత నెమ్మదించినట్లు అనిపించినప్పటికీ.. క్లైమాక్స్ సమయానికి సినిమా మళ్లీ ఊపందుకుంటుంది. దర్శకుడు ఎమోషనల్‌గా, అందంగా ముగింపును డిజైన్ చేయడంతో థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు మంచి అనుభూతి కలుగుతుందని టాక్.
మొత్తంగా నివిన్ పౌలీ మార్క్ కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ఇష్టపడే వారికి ‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’ మంచి ఎంటర్టైనర్గా నిలుస్తుందని ప్రేక్షకుల స్పందన చెబుతోంది. గతేడాది ‘సర్వం మాయ’తో విజయాన్ని అందుకున్న నివిన్ పౌలీ.. ఇప్పుడు ఈ సినిమాతో మరో సాలిడ్ హిట్ అందుకుని ఓనం విజేతగా నిలిచినట్లు అభిమానులు భావిస్తున్నారు.
