స్పిరిట్’తర్వాత ‘కల్కి 2’నుంచి కూడా దీపికా పదుకొణె అవుట్ -‘కమిట్‌మెంట్‌’పై మేకర్స్ కీలక వ్యాఖ్యలు:
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెకి ఇటీవల ఒకదాని తర్వాత ఒకటి షాక్‌లు తగులుతున్నాయి.ప్రభాస్ హీరోగా,సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ‘స్పిరిట్’సినిమా నుంచి ఆమె తప్పుకున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి.దీనిపై ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరిగింది.ఇప్పుడు,ప్రభాస్ మరో భారీ ప్రాజెక్ట్ అయిన ‘కల్కి 2898 AD’సీక్వెల్ నుంచి కూడా దీపికా పదుకొణెని తప్పించారనే వార్త సంచలనం సృష్టిస్తోంది.

వైజయంతీ మూవీస్ కీలక వ్యాఖ్యలు
‘కల్కి 2898 AD’ సీక్వెల్‌లో దీపికా పదుకొణె భాగం కాదని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఒక పోస్ట్ పెట్టింది.చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం.మొదటి సినిమా కోసం ఆమెతో సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ,పార్ట్ 2కి పూర్తిస్థాయిలో భాగస్వామ్యం కుదరలేదు.’కల్కి’లాంటి భారీ సినిమాకి పూర్తి నిబద్ధత అవసరం.ఆమె భవిష్యత్తుకు శుభాకాంక్షలు”అని వైజయంతీ మూవీస్ ఆ పోస్ట్‌లో పేర్కొంది.

అసలు కారణం ఇదేనా?
నిర్మాతలు పరోక్షంగా చెప్పిన ‘కమిట్‌మెంట్’ అనే మాట ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం,దీపికా పదుకొణె రోజుకు 8 గంటల కంటే ఎక్కువ పని చేయనని,ఎక్కువ పని చేస్తే అదనపు రెమ్యునరేషన్ ఇవ్వాలని కొన్ని నిబంధనలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.’స్పిరిట్’ విషయంలో కూడా ఇదే కారణం అని వార్తలు వచ్చాయి.’కల్కి’ లాంటి భారీ ప్రాజెక్ట్‌కి నిరంతరంగా షూటింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి,దీపికా పదుకొణె పెట్టిన షరతులు నిర్మాతలకు ఇబ్బందిగా మారాయని అంటున్నారు.

మొత్తానికి,’స్పిరిట్’తర్వాత ‘కల్కి 2’నుంచి కూడా దీపికా పదుకొణె తప్పుకోవడం అభిమానులను నిరాశపరిచింది.ఆమె స్థానంలో ఎవరు నటిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఈ విషయంపై మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana