
DNews:20 OCT:హైదరాబాద్: దీపావళి సందర్బంగా ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సాంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారులకు బంపర్ గిఫ్ట్ ప్రకటించింది. కొత్త కస్టమర్ల కోసం BSNL ఒక నెలపాటు ఉచిత 4G డేటా ఆఫర్ తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద కేవలం ఒక రూపాయి చెల్లించి మొత్తం నెలరోజులు 4G ఇంటర్నెట్ సర్వీస్‌ను ఆస్వాదించవచ్చు.
ఆఫర్ ముఖ్యాంశాలు:
- రోజుకు 2GB హై-స్పీడ్ 4G డేటా
- ఆన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్
- రోజుకు 100 SMSలు ఫ్రీ
- ఉచిత సిమ్ కార్డ్ అందుబాటులో
BSNL తెలిపిన ప్రకారం, ఈ ఆఫర్‌లో ఎటువంటి సర్వీస్ ఛార్జీలు ఉండవు. అంటే అదనపు ఖర్చులు లేకుండా 30 రోజులపాటు ఫ్రీగా నెట్‌ను వాడుకోవచ్చు.
BSNL చైర్మన్ ప్రకటన:
BSNL చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎ. రాబర్ట్ జె. రవి మాట్లాడుతూ, “ఫ్రీ ఆఫర్ ముగిసిన తర్వాత కూడా నెట్‌వర్క్ క్వాలిటీ, కవరేజ్‌పై విశ్వాసంతో కస్టమర్లు BSNLతోనే కొనసాగుతారని” తెలిపారు.
గత ఆఫర్ విజయవంతం:
ఈ ఏడాది ఆగస్టులో BSNL ఇలాంటి ఆఫర్‌ను ఇచ్చి భారీ స్పందన సాధించింది. దాంతో 1.38 లక్షలకుపైగా కొత్త కస్టమర్లు BSNLకు చేరారు. ఫలితంగా కంపెనీ కస్టమర్ బేస్ పరంగా ఎయిర్‌టెల్‌ను అధిగమించి రెండో స్థానంలో నిలిచింది.
ఆఫర్ పొందే విధానం:
క్రొత్త కస్టమర్లు సమీపంలోని BSNL స్టోర్ లేదా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు.
ఆఫర్ అమలులో ఉండే కాలం: అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 వరకు.
