DSports:10 OCT:వెస్టిండీస్‌లోని రెండో టెస్టులో భారత బ్యాటర్ల ప్రదర్శన ఆకట్టుకుంటోంది. తొలి రోజు రెండవ సెషన్‌లో భారత బలమైన ప్రారంభం విజయవంతమైంది. టీమ్ ఇండియా టీ బ్రేక్ సమయానికి 2 వికెట్లు కోల్పోగా 220 పరుగులు చేసింది. క్రీజ్‌లో యశస్వి జైస్వాల్ 111* పరుగులతో, సాయి సుదర్శన్ 71* పరుగులతో నిలిచారు. వీరు రెండో వికెట్ భాగస్వామ్యంగా 162 పరుగులు జోడించడం విశేషం. దీనికి ముందు ఓపెనర్ కేఎల్ రాహుల్ 38 పరుగులకే అవుట్ అయ్యాడు.

ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ సెంచరీ సాధించడం మరింత ప్రత్యేకత కలిగింది. కేవలం 145 బంతుల్లోనే 100 పరుగుల మైలురాయిని దాటాడు. టెస్టు కెరీర్లో ఇది యశస్వికి ఏడో శతకం. 24 ఏళ్ల వయసులోనే టెస్టుల్లో ఏడు సెంచరీలు సాధించిన తొమ్మిదో భారతీయ బ్యాటర్‌గా అతను నిలిచాడు. ఈ క్రమంలో డాన్ బ్రాడ్మన్ (12), సచిన్ టెండూల్కర్ (11), గ్యారీఫీల్డ్ సోబర్స్ (9) వంటి దిగ్గజ బ్యాటర్లు అతడి ముందున్నార. అలాగే, జావెద్ మియాందాద్, గ్రేమ్ స్మిత్, అలిస్టర్ కుక్, కేన్ విలియమ్సన్‌లు కూడా 7 లేదా అంతకంటే ఎక్కువ టెస్టు సెంచరీలు సాధించారు.

యశస్వి సెంచరీతో టీమ్ ఇండియా మంచి స్థాయిలో క్రీజ్‌ను కొనసాగిస్తున్నప్పుడు, సాయి సుదర్శన్ కూడా అర్ధశతకం పూర్తి చేసి తన ఫారమ్‌ను ప్రదర్శించాడు. ఈ రెండు యువ బ్యాటర్ల స్థిరమైన ప్రదర్శన భారత జట్టు విజయానికి దారితీసే అవకాశం కలిగిస్తోంది. టెస్టు మ్యాచ్‌లో యువ ప్రతిభలు వెలుగులోకి రావడం భారత క్రికెట్‌కు సానుకూల సంకేతం అని చెప్పాలి.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana