
గ్రాండ్ చెస్ టూర్ సెమీఫైనల్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. నిలకడైన ఆటతో ఫైనల్ బెర్త్‌కు మరింత దగ్గరయ్యాడు.
సోమవారం జరిగిన క్లాసికల్ రెండో గేమ్‌లో ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌పై విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన తొలి గేమ్ డ్రాగా ముగియడంతో.. రెండో గేమ్ విజయంతో కీమర్‌పై ప్రజ్ఞానంద 9-3 పాయింట్లతో ఆధిక్యంలోకి వెళ్లాడు.
మరోవైపు రెండో సెమీఫైనల్‌లో అమెరికా ఆటగాళ్లు ఫాబియానో కరువానా, వెస్లీ సో మధ్య జరిగిన క్లాసికల్ గేమ్ డ్రాగా ముగిసింది. దీంతో ఇద్దరూ చెరో 6 పాయింట్లతో సమంగా ఉన్నారు.
ఈ టోర్నీలో విజయం సాధించిన ఆటగాడికి 6 పాయింట్లు, డ్రా చేసుకున్న వారికి 3 పాయింట్లు కేటాయిస్తున్నారు. తదుపరి రౌండ్‌లో ప్రజ్ఞానంద-కీమర్, కరువానా-వెస్లీ సో మధ్య రెండు ర్యాపిడ్, నాలుగు బ్లిట్జ్ గేమ్స్ జరగనున్నాయి.
ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న ప్రజ్ఞానంద.. మిగిలిన గేమ్స్‌లోనూ ఇదే జోరు కొనసాగించి ఫైనల్‌లో అడుగుపెట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.
