
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట విషాదం నెలకొంది. గత నాలుగేళ్లుగా తన కుటుంబంలో ఒకరిగా కలిసిపోయిన ఆయన పెంపుడు శునకం ‘భగీర’ కన్నుమూసింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. భగీరతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆయన చేసిన భావోద్వేగ పోస్ట్ అభిమానులను సైతం కలచివేసింది.
ఎన్టీఆర్ తన పోస్ట్‌లో.. “నా జీవితాన్ని ఎంతో అందంగా మార్చావు.. నీపై ఉన్న ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది” అంటూ భగీరపై తనకున్న అనుబంధాన్ని వెల్లడించారు. భగీరతో కలిసి దిగిన ఫొటోలను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కుటుంబ సభ్యుడిలా మారిన భగీర
పెంపుడు జంతువులకు, మనుషులకు మధ్య ఏర్పడే అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. ముఖ్యంగా ఇంట్లో కొంతకాలం కలిసి ఉంటే అవి కుటుంబంలో ఒకరిగా మారిపోతాయి. భగీర కూడా గత నాలుగేళ్లుగా ఎన్టీఆర్ కుటుంబంలో అదే విధంగా కలిసిపోయినట్లు తెలుస్తోంది. తన అల్లరితో ఇంట్లో సందడి చేసే భగీర ఇక లేదన్న విషయం ఎన్టీఆర్ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది.
భగీర మృతితో ఎన్టీఆర్ అభిమానులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తారక్‌కు ధైర్యం చెబుతూ.. భగీరకు నివాళులు అర్పిస్తున్నారు.
త్వరలో షూటింగ్‌కు ఎన్టీఆర్
ఇదిలా ఉంటే.. ఇటీవల చిన్నపాటి శస్త్రచికిత్స చేయించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. త్వరలోనే ఆయన తిరిగి ‘డ్రాగన్’ సినిమా షూటింగ్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘దేవసేనాపతి’ (గాడ్ ఆఫ్ వార్) అనే భారీ ప్రాజెక్ట్‌లో కుమారస్వామి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం భగీర మృతితో విషాదంలో ఉన్న ఎన్టీఆర్ కుటుంబానికి అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.
