
తెలంగాణలోనే పుట్టి పెరిగిన ఈ అమ్మడు యాంకర్, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఒకటి రెండు సినిమాల్లోనూ నటించింది. అయితే బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టడంతోనే ఈ ముద్దుగుమ్మ పేరు బాగా వినిపించింది. ఎనిమిదో సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అందాల భామ.
DET: Sep 14:తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. సినిమా ఇండస్ట్రీ వల్గర్‌గా తయారైంది.. ఓపెన్ గా కమిట్మెంట్ అడుగుతున్నారు. మొన్నామధ్య నాకు ఒకరు ఫోన్ చేసి.. బ్రాండ్ ప్రమోషన్స్ చేయాలన్నారు. పర్సనల్ రిక్వెర్‌మెంట్ అని అన్నాడు నాకు మొదట్లో అర్ధం కాలేదు ఆతర్వాత పర్సనల్ రిక్వెర్‌మెంట్ పదే పదే అంటుంటే అర్ధమైంది. పైగా ఆ వ్యక్తి నాకు తెలిసిన వాడే.. మీ ఫోటోతో పాటు మీ రేటు కూడా బయటకు వెళ్తుంది. బాగా వైరల్ అయింది అని అన్నాడు. కొంతమంది అమ్మాయిల వల్లే ఇది క్రియేట్ అవుతుంది. కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్స్ వస్తాయని క్రియేట్ చేశారు. మా నాన్న మాతో ఉండరు. డొమెస్టిక్ వైలెన్స్ చేశారు. మా నాన్న మంచివాడు కాదు. నాన్న అమ్మని,నన్ను టార్చర్ చేశాడు. అందుకే నేను డాడీని ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పా.. మా అమ్మ నన్ను కష్టపడి పెంచింది. మా అమ్మలా నేను కూడా నా పిల్లలను పెంచలేను.. మా అమ్మకు ఓ సొంత ఇల్లు కొనివ్వడమే నా లక్ష్యం అని చెప్పింది నైనికా
