DNews:29 OCT:హైదరాబాద్‌,: ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షం హైదరాబాద్‌ నగరాన్ని ట్రాఫిక్ రద్దీతో నానా ఇబ్బందులకు గురిచేసింది. బుధవారం ఉదయం ఆఫీసు టైమ్‌లోనే వర్షం కురవడంతో రోడ్లపై వాహనాలు కదలాడలేని పరిస్థితి ఏర్పడింది. సాధారణ రోజుల్లో కూడా రద్దీగా ఉండే రోడ్లు ఈరోజు వర్షంతో మరింత కిటకిటలాడాయి.వర్షం కారణంగా పలు రోడ్లపై నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. వ్యక్తిగత వాహనాలు అధికంగా రోడ్లపైకి రావడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. ఫలితంగా నగరంలోని ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది.

కూకట్‌పల్లి JNTU నుండి హైటెక్‌ సిటీ, రాయదుర్గం, మాదాపూర్‌, కేబుల్‌ బ్రిడ్జ్‌, బయోడైవర్సిటీ, ఐకియా జంక్షన్‌ వరకు వాహనాలు అతి నెమ్మదిగా కదులుతున్నాయి. సాధారణంగా గంటలో ఆఫీసులకు చేరుకునే ఉద్యోగులు ఈరోజు రెండు గంటలకుపైగా సమయం తీసుకోవాల్సి వచ్చింది.అల్వాల్ రైతు బజార్ సమీపంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. రైల్వే వంతెనపై ఒక లారీ పంచర్‌ అవడంతో బ్రేక్‌డౌన్‌ అయ్యింది. ఫలితంగా తూముకుంట, తిరుమలగిరి వైపులా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది

ఒకవైపు భారీ వర్షం, మరోవైపు రద్దీ ట్రాఫిక్‌ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్‌ పోలీసులు ప్రధాన కూడళ్ల వద్ద రద్దీ తగ్గించేందుకు కృషి చేస్తున్నప్పటికీ, వర్షం కొనసాగుతుండటంతో సమస్యలు తీరడం కష్టంగా మారింది.

👉ట్రాఫిక్‌ శాఖ హెచ్చరిక
హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ శాఖ వాహనదారులను జాగ్రత్తగా డ్రైవ్‌ చేయాలని, వీలైతే ఆఫీస్‌ అవర్స్‌ సమయంలో వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించాలని సూచించింది.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana