
DNews:27 Nov:హైదరాబాద్లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఓఎన్డీ (Officer on Special Duty)గా పని చేసిన రాజశేఖర్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ప్రశ్నించింది.గురువారం రోజున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో రాజశేఖర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు.దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ విచారణలో SIT అధికారులు ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు.విచారణ, గత ఏడాది మార్చిలో అరెస్టయిన టాస్క్ ఫోర్స్ మాజీ DCP రాధాకిషన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జరిగినట్లు తెలుస్తోంది.రాధాకిషన్ తన స్టేట్మెంట్లో మాజీ సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావించినట్లు సమాచారం.అదేవిధంగా, కేసీఆర్ కుటుంబ సభ్యులు మరియు పార్టీకి చెందిన కీలక నేతల సమస్యలను “సెట్ చేసేందుకు” తాము ఫోన్ ట్యాపింగ్ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నాడు.ఈ వివరాలను పరిశీలించిన SIT, కేసు దర్యాప్తులో భాగంగా కేసీఆర్ OSDగా పని చేసిన రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారా? ఎవరు ఆదేశాలు ఇచ్చారు? అనేవి SIT దృష్టి లో ప్రధాన ప్రశ్నలుగా మారాయి.
