
DNews:06 NOV:కొండాపూర్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR)లో భాగంగా లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ భాగస్వామి సంస్థ లాయిడ్స్ ఆఫ్షోర్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఓ విశేషమైన సేవా కార్యక్రమం చేపట్టింది. సంస్థ లక్ష కిలోల బియ్యాన్ని విరాళంగా అందజేసి దేశవ్యాప్తంగా ఒక చారిత్రాత్మక రికార్డు సృష్టించింది.
ఈ కార్యక్రమాన్ని గురువారం నాలెడ్జ్ సిటీలోని లాయిడ్స్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బియ్యం నింపిన వాహనాలను సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మరియు మేనేజింగ్ డైరెక్టర్ శిరీష వోరుగంటి జెండా ఊపి ప్రారంభించారు.
మొత్తం 1,00,000 కిలోల బియ్యం విరాళం.ఇందులో 50,000 కిలోలు ఉద్యోగులు స్వచ్ఛందంగా అందించగా, మిగతా మొత్తాన్ని సంస్థ అందించింది.బియ్యాన్ని 55 స్వచ్ఛంద సంస్థల (NGOs) ద్వారా నగరంలోని అవసరమైన ప్రజలకు పంపిణీ చేయనున్నారు.
శిరీష వోరుగంటి మాట్లాడుతూ, “సామాజిక బాధ్యతను నెరవేర్చడం మా సంస్థ ప్రధాన లక్ష్యం. ఈ విరాళం ద్వారా వేలాది కుటుంబాలకు ఆహార భద్రత కల్పించగలగడం పట్ల మేము గర్విస్తున్నాం” అన్నారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ హెచ్ఆర్ (పీపుల్ అండ్ ప్లేసెస్) డాక్టర్ విపుల్ సింగ్, సంస్థ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
