DNews: 26 Dec: బంగారం, వెండి ధరలు మరోసారి రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. బంగారం ధర మరోసారి లక్షా 40 వేల మార్కును దాటింది. ఈ వారం బంగారం ధర ఈ మార్కును చేరడం ఇది రెండోసారి. ఈ వారం ప్రారంభం నుంచే బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ధరలు వేలల్లో పెరుగుతుండటంతో కొనుగోలుదారులకు ఇది భారంగా మారింది. ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో, ఈ ధరల పెరుగుదల కారణంగా బంగారం కొనాలనుకునేవారు వెనకడుగు వేస్తున్నారు.

శుక్రవారం బంగారం ధరలు రూ. 770 పెరిగాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,40,020కి చేరింది. నిన్న ఈ ధర రూ. 1,39,251 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 700 పెరిగింది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,28,350గా ఉంది. నిన్న ఈ ధర రూ. 1,27,650 వద్ద స్థిరపడింది.

ఢిల్లీలో వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ. 6,000 పెరిగింది. గురువారం ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 2,34,000 ఉండగా, నేడు అది రూ. 2,40,000 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ. 9,000 పెరిగింది. గురువారం రూ. 2,45,000 ఉన్న ధర, శుక్రవారం నాటికి రూ. 2,54,000కి చేరింది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana