
DNews:13 Dec: పదో తరగతి అర్హత ఉన్న నిరుద్యోగులకు శుభవార్త. భారతీయ రైల్వే పరిధిలోని రైలు కోచ్ తయారీ యూనిట్లలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కోచ్ ఫ్యాక్టరీలు, ప్రొడక్షన్ యూనిట్లలో అప్రెంటిస్, ట్రేడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.ఈ నియామకాలకు కనీస అర్హతగా పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు రైలు కోచ్‌ల తయారీ, అసెంబ్లీ, మెయింటెనెన్స్ వంటి విభాగాల్లో శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.
అభ్యర్థుల ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుందని, రాత పరీక్ష లేకుండా పదో తరగతి మరియు ఐటీఐ మార్కుల ఆధారంగా జాబితా సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టైఫండ్/వేతనం చెల్లించనున్నారు.ఆసక్తి గల అభ్యర్థులు భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ పూర్తి వివరాలు పరిశీలించి, నిర్ణీత గడువు లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశం రైల్వే రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుందని అధికారులు పేర్కొన్నారు.
