
Dnews 28: నేపాల్ జల విలయం నేపథ్యంలో ఇప్పటివరకు తెలంగాణకు చెందిన 23 మంది అక్కడ చిక్కుకుపోయినట్టు గుర్తించారు. అందులో స్థానికులతోపాటు రాష్ట్రానికి చెందిన ఎన్నారైలు కూడా ఉన్నారు.నేపాల్ జల విలయం నేపథ్యంలో ఇప్పటివరకు తెలంగాణకు చెందిన 23 మంది అక్కడ చిక్కుకుపోయినట్టు గుర్తించారు. అందులో స్థానికులతోపాటు రాష్ట్రానికి చెందిన ఎన్నారైలు కూడా ఉన్నారు. ఢిల్లీలోని తెలంగాణభవన్ హెల్ప్‌లైన్, సమన్వయ కేంద్రం, హైదరాబాద్‌లోని సచివాలయం హెల్ప్లైన్లకు బాధితుల కుటుంబాల నుంచి సుమారు 80వరకు కాల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రాథమిక పరిశీలన అనంతరం 23 మంది తెలంగాణవారు నేపాల్ వెళ్లి చిక్కుకున్నట్టు గుర్తించామని.. అందులో ఆరుగురు స్థానికులుకాగా, మరో 17 మంది తెలంగాణ మూలాలున్న ఎన్నారైలు అని వెల్లడించారు. వారిలో చాలా మంది ఘటన సమయంలో నేపాల్ – టిబెట్ మధ్య ప్రాంతంలో ప్రయాణిస్తున్నవారేనని.. అక్కడి రసువా, రసువాగఢి, గ్యిరోంగ్ ప్రాంతాల నుంచి వారు చివరిసారిగా సంప్రదించారని తెలిపారు. మానస సరోవర్ యాత్రకు వెళ్లిన రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి సురక్షితంగా ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఇక నేపాల్‌లో తాము క్షేమంగానే ఉన్నామని, విపత్తు సంభవించే సమయానికి తాము అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లామని డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డితో కూడిన బృందం తెలిపింది. ఈ మేరకు గురువారం వీడియోను విడుదల చేసింది.ప్రజల భద్రతకు ప్రత్యేక చర్యలు: పొంగులేటి
ఆకస్మిక వరదలతో నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. చిక్కుకుపోయిన తెలంగాణవారి వివరాలను విదేశాంగ శాఖకు పంపామని… అవసరమైన సహాయం అందించేందుకు కేంద్రంతో, నేపాల్ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని ఒక ప్రకటనలో వెల్లడించారు. వరదల్లో చిక్కుకున్నవారి కుటుంబ సభ్యులు వారి వివరాలను ప్రభుత్వానికి అందించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణభవన్ హెల్ప్‌లైన్ 9871999044, 9949351270 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
