DNews:10 Jan: హైదరాబాద్‌లోని చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ ప్రాంతం నిరుద్యోగ అభ్యర్థుల ఆందోళనలతో శనివారం మధ్యాహ్నం రణరంగంగా మారింది. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో స్పష్టత లేదని, ఎన్నికల హామీ మేరకు వెంటనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది విద్యార్థులు, అభ్యర్థులు నిరసనకు దిగారు. లైబ్రరీ నుంచి అశోక్ నగర్ వైపు భారీ ర్యాలీగా వెళ్లేందుకు నిరుద్యోగులు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడుగడుగునా అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ముందస్తుగా భారీ బలగాలను మోహరించి లైబ్రరీ గేట్లను మూసివేయడమే కాకుండా, రోడ్లపైకి వచ్చిన నిరసనకారులను బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనాల్లో పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ఈ క్రమంలో పోలీసులు మరియు విద్యార్థుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. తమ ఆవేదనను శాంతియుతంగా విన్నవించుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతించడం లేదని, ప్రజాస్వామ్యబద్ధంగా చేసే నిరసనలను పోలీసులతో అణచివేస్తున్నారని విద్యార్థి నాయకులు మండిపడ్డారు. నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో చిక్కడపల్లి, నారాయణగూడ, మరియు ముషీరాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. అశోక్ నగర్ కోచింగ్ సెంటర్ల వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి గట్టి నిఘా ఉంచారు. ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా పోలీసుల దిగ్బంధంలో ఉంది, ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana