D Educt: Oct 9: ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు ఆప్షన్ల నమోదు.. నేటి సాయంత్రం 4 గంటల వరకు గడువు

విజయవాడ: ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌, ఎన్‌సీసీ కేటగిరీ సీట్ల ప్రవేశాలకు అర్హత సాధించిన అభ్యర్థులు ఆప్షన్లు నమోదు చేసుకోవాలని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం సూచించింది.

అభ్యర్థులకు కీలక సూచన: అర్హులైన అభ్యర్థులు అక్టోబరు 9వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా తమకు నచ్చిన కళాశాలలకు సంబంధించిన ఐచ్ఛికాలను నమోదు చేసుకోవాలని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సాయిసుధీర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. గడువులోగా ఆప్షన్ల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.