
DSports 6Dec:విశాఖపట్నం: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం (డిసెంబర్ 6) జరగనున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డే మ్యాచ్ కోసం డా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఈ సిరీస్ 1-1తో సమంగా ఉండటంతో, సిరీస్ విజేతను నిర్ణయించే ఈ కీలక పోరును ప్రత్యక్షంగా చూడటానికి జనం భారీగా పోటెత్తారు.
- విశాఖ మైదానం కోహ్లీకి అత్యంత అచ్చొచ్చిన వేదిక. ఇక్కడ ఆడిన 7 వన్డేల్లో అతను 97.83 సగటుతో మూడు సెంచరీలు సాధించాడు. ఈరోజు డూ ఆర్ డై మ్యాచ్లో కూడా కోహ్లీ మరోసారి అద్భుత ప్రదర్శన చేయాలని, భారత్కు సిరీస్ విజయాన్ని అందించాలని భారీగా తరలివచ్చిన అభిమానులు ఆశిస్తున్నారు.
