
D News: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ‘ఫంకీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు.. ఇక వచ్చే కొన్ని నెలల్లో మరో మూడు సినిమాలను థియేటర్లలోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడు. ముఖ్యంగా ఈ మూడు సినిమాలు కేవలం 36 రోజుల వ్యవధిలో విడుదల కానుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘CULT’ అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం. ఈ సినిమాను స్లాషర్ థ్రిల్లర్‌గా రూపొందించారు. మరోవైపు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న ‘ENE Repeat’ నవంబర్ 19న రిలీజ్ కానుంది. 2018లో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’కి ఇది సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై యువతలో మంచి అంచనాలు ఉన్నాయి.
ఇక సాయికిరణ్ రెడ్డి దైడ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘Legacy’ డిసెంబర్ 4న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్‌ను పవర్ఫుల్ అవతార్‌లో చూపించనున్నారు. ఈ రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.
ఒకే ఏడాదిలో నాలుగు సినిమాలు?
అక్టోబర్ 30న ‘CULT’, నవంబర్ 19న ‘ENE Repeat’, డిసెంబర్ 4న ‘Legacy’ విడుదలైతే.. ఈ మూడు సినిమాలు కేవలం 36 రోజుల వ్యవధిలో థియేటర్లలోకి వచ్చినట్టవుతుంది. ఒకే ఏడాదిలో ఇంత తక్కువ గ్యాప్‌లో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం టాలీవుడ్లో చాలా అరుదైన విషయంగా చెప్పొచ్చు. అయితే ఈ తేదీల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఇదే షెడ్యూల్ కొనసాగితే విశ్వక్ సేన్‌కు మరో ప్రత్యేకత కూడా దక్కుతుంది. కె.వి. అనుదీప్ దర్శకత్వంలోని ‘ఫంకీ’ ఫిబ్రవరి 13న విడుదలైన నేపథ్యంలో.. మిగిలిన మూడు సినిమాలు కూడా 2026లోనే వస్తే ఒకే ఏడాదిలో నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన హీరోగా నిలుస్తాడు. వరుసగా విభిన్న జానర్ల సినిమాలతో వస్తున్న విశ్వక్ సేన్ ఈ ప్రయోగంలో ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.
