
DET:MAR 02:
అల్లు వారి ఇంట్లో పెళ్లి బాజాలు పెళ్లి కొడుకైన శిరీష్!
మెగా కాంపౌండ్ అల్లు అరవింద్ చిన్నబ్బాయి నటుడు అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి.గత కొద్ది రోజులుగా శిరీష్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు ఆ వార్తలన్నీ నిజం చేస్తూ అల్లు వారి ఇంట్లో పెళ్లి కొడుకు వేడుకను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సందడిగా మారిన అల్లు నివాసం:
ఈ పెళ్లి కొడుకు ఫంక్షన్ కోసం అల్లు శిరీష్ నివాసాన్ని పూలతో,విద్యుత్ దీపాలతో ఎంతో అందంగా అలంకరించారు.అల్లు అరవింద్ దంపతులు దగ్గరుండి ఈ వేడుకను జరిపించారు.శిరీష్ తన కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య సంప్రదాయబద్ధంగా పసుపు రాసుకుని పెళ్లి పీటల మీద కూర్చున్నారు.ఈ వేడుకలో శిరీష్ చాలా హ్యాపీగా చిరునవ్వుతో కనిపించారు.
స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన రష్మిక – విజయ్ దేవరకొండ:
ఈ వేడుకలో అందరి కళ్ళు ఒకే చోట ఆగిపోయాయి.అదే విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న రాక.వీరిద్దరూ అల్లు శిరీష్‌కు మంచి స్నేహితులు కావడంతో ఈ స్పెషల్ మూమెంట్‌లో పాలుపంచుకోవడానికి వచ్చారు.ఇద్దరూ కలిసి ఈ ఫంక్షన్‌లో సందడి చేయడంతో గెస్టులందరూ సర్ప్రైజ్ అయ్యారు.ముఖ్యంగా వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.
సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ:
శిరీష్ పెళ్లి కొడుకు వేడుక ఫోటోలు బయటకు రాగానే నెటిజన్లు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.పెళ్లి కొడుకు బాగున్నాడు,అల్లు ఫ్యామిలీలో మరో శుభకార్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే అమ్మాయి ఎవరు? ఎక్కడి అమ్మాయి? అనే వివరాలను మాత్రం అల్లు ఫ్యామిలీ ఇంకా సీక్రెట్‌గానే ఉంచింది.త్వరలోనే గ్రాండ్‌గా జరగబోయే ఈ పెళ్లికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
