DNews: Nov21: డ్రైవర్‌, యజమానిపైకేసునమోదు, సిబ్బందిపైశాఖాపరమైనచర్యలు

తిరుమల, 2025 నవంబర్ 20: తమిళనాడు రాష్ట్రానికి చెందిన TN-31-AE-4073 వాహనంపై అన్య మతానికి చెందిన చిహ్నం స్టిక్కర్ అతికించబడి సదరు వాహనము తిరుమల కొండ పై ఉన్న విషయం గుర్తించబడింది. 

ఈ దినము, ఉదయం 10.40 గంటల సమయంలో అలిపిరి చెక్పోస్ట్ వద్ద ఈ వాహనం 9 వ లేన్ గుండా వచ్చినప్పటికీ, అక్కడ విధుల్లో ఉన్న CT-5949 వి. వాసు బాబు (9వ లేన్, అలిపిరి) ఈ అన్య మత చిహ్నాన్ని గుర్తించలేకపోయారు.

ఈ సమాచారం అందిన వెంటనే, సంబంధిత విజిలెన్స్ సిబ్బంది వాహనాన్ని తిరుమల నందు ఫైర్ ఆఫీస్ సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో గుర్తించి, వెంటనే ఆ స్టిక్కర్‌ను తొలగించారు. అనంతరం, ఈ విషయంపై తిరుమల II టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, వాహన డ్రైవర్ అయిన గోబి, కరూర్ జిల్లా (తమిళనాడు) మరియు ఆ వాహనం యొక్క యజమాని  పై AP చారిటబుల్ మరియు హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్  మరియు ఎండోమెంట్ Act – 1987 ( AP CHRIE ACT)  పరిధిలో కేసు నమోదు చేయబడింది.

పలుమార్లు సూచనలు ఇచ్చినప్పటికీ స్టిక్కర్‌ను గుర్తించడంలో విఫలమైనందున, CT-5949 వి. వాసు బాబు ను వెంటనే అలిపిరి విధుల్లో నుండి తొలగించడమైనది. అతని పై విధుల్లో నిర్లక్ష్యానికి సంబంధించి శాఖాపరమైన చర్యలు తీసుకోవడo జరిగింది.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana