
DNews: Nov 21: హైదరాబాద్‌లో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) వజ్రోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ జేఎన్‌టీయూ కేవలం ఒక విశ్వవిద్యాలయం మాత్రమే కాదు, దేశానికి, ముఖ్యంగా తెలంగాణకు ఒక గొప్ప ఆస్తి అని అన్నారు. దేశానికి ఇంజనీర్లను తయారు చేసే శక్తివంతమైన ఇంజిన్‌గా జేఎన్‌టీయూను ప్రశంసించారు. ఐఎస్ఆరొ నుంచి గూగుల్ వరకు, డీఆర్‌డీఓ నుంచి టెస్లా వరకు జేఎన్‌టీయూ విద్యార్థుల ప్రతిభ ప్రపంచానికి గర్వకారణమని పేర్కొన్నారు. విద్య అనేది ఖర్చు కాదు, భవిష్యత్తును నిర్మించే పెట్టుబడి అని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. ఉద్యోగాల కోసం వెతికే వారిగా కాకుండా, ఉద్యోగాలను సృష్టించే వారిగా మారాలని ఆయన సూచించారు. గత 60 సంవత్సరాల కంటే రాబోయే 60 సంవత్సరాలు మరింత వైభవంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆకాంక్ష వ్యక్తం చేశారు.
