The Paradise Wraps Up Shooting.. Nani’s Mass Action Drama Gets Ready for Release!

D News: నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ **‘ది ప్యారడైజ్’**పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘దసరా’ తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచే మంచి హైప్ నెలకొంది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. రామోజీ ఫిల్మ్ సిటీలో నాని, కయాదు లోహర్‌పై చివరి పాట చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులను ప్రారంభించగా.. ఎడిటింగ్, వీఎఫ్‌ఎక్స్, సౌండ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో సాగుతున్నాయి.

ఇప్పటికే సినిమా విడుదల తేదీపై కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 24, 2026న ‘ది ప్యారడైజ్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇటీవల వాయిదా వార్తలు వచ్చినప్పటికీ.. మేకర్స్ అదే తేదీని మరోసారి అధికారికంగా ఖరారు చేశారు.

నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. కీర్తి సురేష్ స్పెషల్ అప్పియరెన్స్‌లో కనిపించనుంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకోవడంతో ఇక ప్రమోషన్స్‌పై టీమ్ మరింత ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ కోసం నాని అభిమానులు ఎదురుచూస్తున్న సమయం దగ్గరపడుతోంది. సెప్టెంబర్ 24న ఈ మాస్ యాక్షన్ డ్రామా థియేటర్లలో ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana