The Paradise Promotions Heat Up: Nani and Team to Tour Four Cities

D News: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ విడుదలకు సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌ను మరింత వేగం పెంచారు మేకర్స్. ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా మూవీ టీమ్ మరో క్రేజీ అప్డేట్‌ను ప్రకటించింది.

నాలుగు నగరాల్లో మూవీ టీమ్ సందడి

సెప్టెంబర్ 24న ‘ది ప్యారడైజ్’ గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో సినిమాను ప్రేక్షకుల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు మేకర్స్ ప్రత్యేక ప్రమోషనల్ టూర్‌ను ప్లాన్ చేశారు.

సెప్టెంబర్ 17 నుంచి ఈ టూర్ ప్రారంభం కానుంది. చెన్నై, బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్ నగరాల్లో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో పాటు చిత్ర బృందం అభిమానులను కలవనుంది. ఇందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేయగా.. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాటలకు ఇప్పటికే భారీ రెస్పాన్స్

ఇక ‘ది ప్యారడైజ్’ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు సోషల్ మీడియాలో మంచి స్పందనను సొంతం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్, సాంగ్స్‌పై ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరుగుతోంది.

అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామాను శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారు. ‘జడల్ జమానా’ అంటూ మూవీ టీమ్ ప్రమోషన్స్‌ను మరింత జోరుగా నిర్వహిస్తోంది.

సెప్టెంబర్ 24న సినిమా థియేటర్లలోకి రానుండటంతో.. రిలీజ్‌కు ముందు ఈ నాలుగు నగరాల ప్రమోషనల్ టూర్ ‘ది ప్యారడైజ్’పై మరింత బజ్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana