
D News: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు ఓవర్సీస్లో మాత్రం సెప్టెంబర్ 23 నుంచే ప్రీమియర్లు ప్రారంభమవుతున్నాయి. నార్త్ అమెరికాలో ఈ చిత్రాన్ని ప్రథ్యంగిర సినిమాస్ విడుదల చేస్తోంది.
తెలుగు వెర్షన్‌కు 21 మార్పులు
ఇటీవల సెన్సార్ ప్రక్రియలో ‘ది ప్యారడైజ్’కు ‘A’ సర్టిఫికెట్ లభించింది. ఈ ప్రక్రియలో మొత్తం 21 మార్పులు, కట్స్ సూచించినట్లు రిపోర్టులు వెల్లడించాయి. హింసాత్మక సన్నివేశాలు, కొన్ని డైలాగ్స్, విజువల్స్‌తో పాటు ఇతర అంశాల్లోనూ మార్పులు చేసినట్లు సమాచారం. సినిమా ఫైనల్ రన్‌టైమ్ దాదాపు 2 గంటల 54 నిమిషాలుగా ఉంది.
ఓవర్సీస్లో మాత్రం అన్‌కట్ వెర్షన్?
ఇదే సమయంలో ఓవర్సీస్ ప్రేక్షకులకు ‘ది ప్యారడైజ్’ టీమ్ నుంచి ప్రత్యేక ట్రీట్ లభించనున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ సూచించిన కట్స్, మ్యూట్స్ లేకుండా ఒరిజినల్ వెర్షన్‌ను ప్రదర్శించనున్నట్లు తాజా రిపోర్టులు చెబుతున్నాయి. అంటే తెలుగు థియేట్రికల్ వెర్షన్లో కనిపించని కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్‌తో కూడిన అన్‌కట్ అనుభవాన్ని ఓవర్సీస్ ప్రేక్షకులు పొందే అవకాశం ఉంది.
ఇప్పటికే నాని సినిమా ఓవర్సీస్ ప్రీమియర్లకు భారీగా బజ్ కనిపిస్తోంది. ప్రథ్యంగిర సినిమాస్ కూడా సెప్టెంబర్ 23న నార్త్ అమెరికా ప్రీమియర్లను అధికారికంగా ప్రచారం చేస్తోంది. దీంతో నాని అభిమానుల్లో ప్రీమియర్ షోలపై మరింత ఆసక్తి నెలకొంది.
శ్రీకాంత్ ఓదెల మార్క్ రా అండ్ రస్టిక్ ట్రీట్మెంట్తో రూపొందిన ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
