
D News: Sept 9: SSC GD కానిస్టేబుల్ 2026 ఫలితాలు త్వరలో.. అంచనా కటాఫ్ ఇదే!
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించిన జీడీ కానిస్టేబుల్ 2026 పరీక్ష ఫలితాలు సెప్టెంబర్ రెండో వారం నుంచి నాలుగో వారం మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఫలితాల విడుదలకు సంబంధించి కచ్చితమైన తేదీని కమిషన్ ఇంకా ప్రకటించలేదు.
మే 31, 2026తో ముగిసిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)కు సంబంధించిన ఆన్సర్ కీపై అభ్యంతరాల సవరణ గడువు జూన్ 20తో పూర్తయింది. ఫలితాలను పురుషులు, మహిళా అభ్యర్థులకు వేర్వేరుగా మెరిట్ జాబితాల రూపంలో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
మొత్తం 25,487 ఖాళీల భర్తీ కోసం ఈ పరీక్షను నిర్వహించారు. ఇందులో 23,467 పురుషుల పోస్టులు, 2,020 మహిళల పోస్టులు ఉన్నాయి. పరీక్షకు దేశవ్యాప్తంగా మొత్తం 48,83,309 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఈ పోస్టులను సీఐఎస్ఎఫ్‌లో 14,595, సీఆర్‌పీఎఫ్‌లో 5,570, అస్సాం రైఫిల్స్‌లో 1,706, ఎస్‌ఎస్‌బీలో 1,765, ఐటీబీపీలో 1,296, బీఎస్‌ఎఫ్‌లో 616, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో 253 చొప్పున భర్తీ చేయనున్నారు.
కేటగిరీల వారీగా అంచనా కటాఫ్ మార్కులు
ఫలితాలపై అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో కేటగిరీల వారీగా అంచనా కటాఫ్ మార్కులు కూడా వెలువడ్డాయి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 148-156, ఓబీసీ అభ్యర్థులకు 145-153, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 142-150 మార్కుల మధ్య కటాఫ్ ఉండొచ్చని అంచనా.
అదేవిధంగా ఎస్సీ అభ్యర్థులకు 134-142, ఎస్టీ అభ్యర్థులకు 124-134 మార్కుల మధ్య కటాఫ్ ఉండే అవకాశం ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. అధికారిక ఫలితాలు, కటాఫ్ మార్కులు విడుదలైన తర్వాతే తుది వివరాలపై స్పష్టత రానుంది.
