D Spiritual: Nov 21: కనగల్‌లో ఘనంగా కార్తీక శుద్ధ ఏకాదశి ప్రత్యేక పూజలు

కనగల్: మండల కేంద్రమైన కనగల్ గ్రామంలోని పురాతన శివాలయమైన శ్రీ పార్వతి బండి రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయం వేద మంత్రోచ్ఛారణలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

భక్తులు ఆలయ సన్నిధిలో పాలు, పూలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించి, కుంకుమార్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు భక్తులు కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులను సమర్పించుకున్నారు.

అదేవిధంగా మాలధార స్వాములు ఆలయంలో ప్రదక్షిణలు చేసి, భక్తిశ్రద్ధలతో పరమశివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు మణికంఠ శర్మ, శేషగిరి ప్రసాద్ శర్మతో పాటు పలువురు భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *