DNews: Nov 28: నిజామాబాద్ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. డోంచంద గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్రీకాంత్ రెడ్డి, ఎరుగట్ల గ్రామానికి చెందిన అఖిలతో గత ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఈ నేపథ్యంలో లండన్‌లో ఉద్యోగం చేస్తున్న శ్రీకాంత్ రెడ్డి, తన ప్రియురాలిని వివాహం చేసుకోవడానికి స్వగ్రామానికి వచ్చాడు. అయితే అఖిల తండ్రి ఆమెకు మరో యువకుడితో వివాహం జరిపే ఏర్పాట్లు చేశారు. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీకాంత్ రెడ్డి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.

ఈ ఘటనపై ఆగ్రహించిన కుటుంబ సభ్యులు నిజామాబాద్ పట్టణంలో శ్రీకాంత్ రెడ్డి మృతదేహంతో నిరసన చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనను అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీకాంత్ రెడ్డి మరణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana