Samsung Galaxy A38 Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ త్వరలోనే తన కొత్త Galaxy A38 5G స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఈ ఫోన్ భారీ 6,000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు పలు ఆకట్టుకునే ఫీచర్లతో రానుందని అంచనా. ఈ ఫోన్ అంచనా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

  • ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండే అవకాశం.
  • శాంసంగ్ గెలాక్సీ A38లో 6,000mAh భారీ బ్యాటరీ ఉండొచ్చని అంచనా.
  • గతంలో విడుదలైన గెలాక్సీ A37 5Gకి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రానున్న కొత్త ఫోన్.

Samsung Galaxy A38 Launch: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ తన ఏ-సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. Samsung Galaxy A38 5G పేరుతో రానున్న ఈ ఫోన్.. గతంలో మార్కెట్లోకి వచ్చిన Galaxy A37 5Gకి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది మార్చిలో Galaxy A37 5G భారత మార్కెట్లో విడుదలైంది.

మీడియా నివేదికల ప్రకారం.. రాబోయే Galaxy A38లో బ్యాటరీ సామర్థ్యం, కెమెరా విభాగాల్లో కీలక మార్పులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా గత మోడల్‌తో పోలిస్తే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంతో పాటు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించవచ్చని సమాచారం. అయితే, ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ధర కూడా మునుపటి మోడల్‌తో పోలిస్తే పెరిగే అవకాశముందని తెలుస్తోంది.

Samsung Galaxy A38: బ్యాటరీ, కెమెరా ఫీచర్లు

శాంసంగ్ గెలాక్సీ A38 5Gలో ప్రధాన ఆకర్షణగా భారీ బ్యాటరీ నిలవనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,882mAh బ్యాటరీని అందించవచ్చని నివేదికలు చెబుతున్నాయి. దీనిని 6,000mAh బ్యాటరీ సామర్థ్యంతో మార్కెట్లో ప్రచారం చేసే అవకాశం ఉంది.

ఇదే సమయంలో గత మోడల్ అయిన Samsung Galaxy A37 5Gలో 5,000mAh బ్యాటరీ మాత్రమే ఉంది. దీంతో కొత్త ఫోన్‌లో బ్యాటరీ సామర్థ్యం పెరిగితే వీడియోలు చూడటం, ఇంటర్నెట్ బ్రౌజింగ్, గేమింగ్ వంటి పనులకు మెరుగైన బ్యాకప్ లభించవచ్చు.

కెమెరా విషయానికి వస్తే.. Galaxy A38లో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉండొచ్చని అంచనా. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5MP మాక్రో కెమెరా ఉండే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 12MP ఫ్రంట్ కెమెరాను అందించవచ్చని సమాచారం.

Samsung Galaxy A37 5G: ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న Samsung Galaxy A37 5G పలు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్, 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్ Awesome Lavender, Awesome Charcoal, Awesome Graygreen కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8.5 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.

Samsung Galaxy A37 5G: ప్రాసెసర్, కెమెరా వివరాలు

పనితీరు పరంగా Samsung Galaxy A37 5Gలో Exynos 1480 ప్రాసెసర్‌ను అందించారు.

కెమెరా విభాగంలో 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5MP మాక్రో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంది.

Samsung Galaxy A58 5G లాంచ్ కూడా త్వరలోనే!

మరోవైపు శాంసంగ్ తన ఏ-సిరీస్‌లో Galaxy A58 5G స్మార్ట్‌ఫోన్‌ను కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ఫోన్ గతంలో విడుదలైన Galaxy A57 5Gకి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

నివేదికల ప్రకారం.. Samsung Galaxy A58 5G వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంతో పాటు ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల కావచ్చని తెలుస్తోంది.

అయితే, Galaxy A38 5Gకు సంబంధించి లాంచ్ తేదీ, ధర, పూర్తి ఫీచర్ల వివరాలను శాంసంగ్ అధికారికంగా ప్రకటించలేదు. కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వివరాలను అంచనాలుగానే పరిగణించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *