
D News : కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి, ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ మధ్య విభేదాలపై మరోసారి చర్చ మొదలైంది. ‘కాంతార’ సినిమాతో హీరోగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి భారీ విజయాన్ని అందుకోగా.. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన విషయం తెలిసిందే. అయితే కొంతకాలంగా వీరిద్దరి మధ్య సఖ్యత లేదనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
మళ్లీ తెరపైకి వివాదం
‘కాంతార’ సినిమా విడుదలై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేశారు. అయితే ఆ పోస్టుల్లో హోంబలే ఫిలిమ్స్ పేరును కానీ, ఆ సంస్థ లోగోను కానీ ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ‘కాంతార చాప్టర్ 1’ విడుదలై ఏడాది పూర్తైన సందర్భంగా రిషబ్ శెట్టి షేర్ చేసిన వీడియోలోనూ ఇదే తరహాలో హోంబలే ప్రస్తావన కనిపించకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.
హోంబలే కూడా అదే దారిలో..
రిషబ్ పోస్టులకు హోంబలే ఫిలిమ్స్ కూడా తనదైన రీతిలో స్పందించినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘కాంతార’ నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ షేర్ చేసిన పోస్టర్‌లో రిషబ్ శెట్టి పేరును ప్రస్తావించలేదు. ఇక ‘కాంతార చాప్టర్ 1’ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రిషబ్ ఫొటోకు బదులుగా ఏఐ రూపొందించిన టైగర్ పోస్టర్‌ను సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలతో రిషబ్ శెట్టి, హోంబలే ఫిలిమ్స్ మధ్య విభేదాలు మరింత ముదిరాయనే ప్రచారం మొదలైంది.
ప్రాఫిట్ షేరింగ్ విషయంలో విభేదాలా?
‘కాంతార చాప్టర్ 1’ విషయంలో రిషబ్ శెట్టి, హోంబలే ఫిలిమ్స్ మధ్య ప్రాఫిట్ షేరింగ్‌కు సంబంధించి విభేదాలు వచ్చాయని గతంలోనే వార్తలు వచ్చాయి. ఒప్పందం ప్రకారం తనకు రావాల్సిన మొత్తంపై రిషబ్ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ విషయంపై ఇరు వర్గాల నుంచి స్పష్టమైన అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదిలా ఉంటే రిషబ్ శెట్టి గతంలో హోంబలే, ‘కాంతార’కు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను అన్‌ఫాలో చేయడం కూడా చర్చకు దారితీసింది. అదే సమయంలో ఆయన సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయడం కూడా ఆసక్తిని పెంచింది.
‘కాంతార’ తర్వాత మారిన పరిస్థితులు
‘కాంతార’ విజయం తర్వాత రిషబ్ శెట్టి క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ‘కాంతార’ ఫ్రాంచైజీకి సంబంధించి రిషబ్, హోంబలే ఫిలిమ్స్ మధ్య సంబంధాలు ఎలా కొనసాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇరువైపులా కనిపిస్తున్న పరిణామాలు అభిమానుల్లో చర్చకు దారితీస్తున్నాయి.
అయితే రిషబ్ శెట్టి, హోంబలే ఫిలిమ్స్ మధ్య నిజంగానే వివాదం ముదిరిందా? అసలు సమస్య ఏమిటి? అనే విషయాలపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాన్ని కేవలం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్‌గానే చూడాల్సి ఉంటుంది.
