
D Educt: Sept 3: MBBS సీట్ల కేటాయింపు: తొలి విడతలో 4,322 సీట్లు భర్తీ
ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల తాత్కాలిక కేటాయింపులను విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సెప్టెంబరు 2న వెల్లడించింది.
మొదటి విడత కౌన్సెలింగ్‌లో మొత్తం 4,519 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నట్లు విశ్వవిద్యాలయం తెలిపింది. ఇందులో ఎన్‌సీసీ, క్రీడా విభాగాలకు కేటాయించిన సీట్లను మినహాయించి మిగిలిన 4,322 సీట్లు భర్తీ అయినట్లు ప్రకటించింది.
మొదటి విడత కౌన్సెలింగ్ ద్వారా కన్వీనర్ కోటాలోని మెజారిటీ సీట్లు భర్తీ కావడంతో.. మిగిలిన సీట్లకు సంబంధించిన తదుపరి ప్రక్రియను విశ్వవిద్యాలయం నిబంధనల ప్రకారం కొనసాగించనుంది.
