
D Educt: Sept 4: పోస్టల్ శాఖలో 23,757 జీడీఎస్ ఉద్యోగాలు
దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 23,757 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి పోస్టల్ శాఖ ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్-II, జూలై-2026లో భాగంగా ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు.
పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
పోస్టును బట్టి ప్రారంభ వేతనం రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబరు 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
