D News: Sept 30: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) దిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (CAPF)లో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ నియామక పరీక్ష-2026కు సంబంధించి విడుదల చేసిన నోటిఫికేషన్‌కు దరఖాస్తు గడువు సెప్టెంబర్‌ 30తో ముగియనుంది. అభ్యర్థులు గడువు ముగిసేలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ నియామక పరీక్ష ద్వారా దిల్లీ పోలీసు విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన BSF, CISF, CRPF, ITBP, SSBలో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 1,871 ఖాళీలు ఈ నోటిఫికేషన్‌లో ఉన్నాయి.

CAPFలో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ (GD) పోస్టులు 1,320 ఖాళీలు ఉన్నాయి. దిల్లీ పోలీసు విభాగంలో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ (Executive) పురుషులకు 205 పోస్టులు, మహిళలకు 112 పోస్టులు కేటాయించారు.

అదేవిధంగా CAPFలో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ (Fire) పురుషుల విభాగంలో 234 ఖాళీలు ఉన్నాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలను అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించుకోవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 30లోగా అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.