D Educt: Oct 29: తెలంగాణలో 102 మండల ప్లానింగ్, స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అక్టోబరు 28న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.

అభ్యర్థులు అక్టోబరు 30 నుంచి నవంబరు 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షకు ఏడు రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని కమిషన్ వెల్లడించింది.

తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం, ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష 2027 జనవరిలో నిర్వహించే అవకాశం ఉంది. అర్హతలు, దరఖాస్తు విధానం, పరీక్షా విధానం తదితర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి నోటిఫికేషన్‌ను పరిశీలించాలని కమిషన్ సూచించింది.