
D News: September 2, 2026:పవన్ కళ్యాణ్ ‘OG’ యూనివర్స్‌లో ఆజాద్ హింద్ ఫౌజ్.. సుజీత్ స్పెషల్ ట్రీట్‌తో పెరిగిన అంచనాలు!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సుజీత్ ‘OG Universe’కు సంబంధించిన ప్రత్యేక డిస్కషన్ వీడియోను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్, సుజీత్, సంగీత దర్శకుడు ఎస్. థమన్ మధ్య జరిగిన కథా చర్చలకు సంబంధించిన ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.
OG యూనివర్స్‌లో INA ఎలిమెంట్స్
‘OG Universe’ కథలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ (INA) కు సంబంధించిన అంశాలను సమకాలీన కథతో మిళితం చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ ఈ వీడియోలో వెల్లడించారు.
భారతీయ చరిత్రకు సంబంధించిన అంశాలను ఆధునిక కథనంతో జోడిస్తే గ్రేట్ పొటెన్షియల్ ఉంటుందని పవన్ సూచించారు.
“ఇండియన్ రూట్స్.. వెస్ట్రన్ ప్రజెంటేషన్”
కథ గురించి మాట్లాడుతున్న సమయంలో థమన్ “ఇండియన్ రూట్స్, సౌత్ ఈస్ట్ ఎమోషన్స్, వెస్ట్రన్ ప్రజెంటేషన్” అంటూ OG యూనివర్స్ కాన్సెప్ట్‌ను వివరించారు.
దీనికి పవన్ కళ్యాణ్ థంబ్స్ అప్ చూపించడం వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పవన్.. సమురాయ్ లుక్‌లో
ఈ స్పెషల్ వీడియోలో పవన్ కళ్యాణ్‌ను సమురాయ్ తరహా గంభీరమైన లుక్‌లో ప్రజెంట్ చేశారు. ఓజాస్ గంభీరమైన విజువల్స్‌తో పాటు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వీడియోకు మరింత హైప్ తీసుకొచ్చింది.
“OG ఇప్పుడు యూనివర్సల్ బ్లడ్ గ్రూప్”
చర్చల సందర్భంగా థమన్ “న్యూ బ్లడ్ గ్రూప్ OG” అని పవన్‌తో చెప్పగా. సుజీత్ స్పందిస్తూ “అది ఇప్పుడు యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అయిపోయింది” అంటూ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు.
తమ లైఫ్‌టైమ్‌లోనే బెస్ట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ చెప్పడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.
పవన్‌తో మళ్లీ సుజీత్
‘They Call Him OG’ సినిమాతో పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్‌కు మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా OG Universeను మరింత విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
జులైలోనే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ.. పవన్, సుజీత్ కలిసి OG యూనివర్స్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. కథా చర్చలు, థమన్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్‌కు సంబంధించిన క్షణాలనే తాజాగా విడుదల చేసిన వీడియోలో చూపించారు.
“మొదట నా హీరో.. ఇప్పుడు నా OG”
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సుజీత్ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్‌ను ఆరాధిస్తూ పెరిగానని.. ఒక అభిమానిగా ఆయనను వెండితెరపై చూడటం నుంచి కెమెరా వెనుక నిలబడి ‘యాక్షన్ సర్’ అని చెప్పే స్థాయికి రావడం తనకు ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని సుజీత్ పేర్కొన్నారు.
పవన్ స్టైల్, ఆయన మ్యాడ్‌నెస్‌ను ఆస్వాదిస్తూ పెరిగిన తనకు.. ఇప్పుడు ఆయనతో కలిసి అలాంటి మూమెంట్స్‌ను సృష్టించే అవకాశం రావడం గొప్ప విషయమని చెప్పారు.
“ఆయన మొదట నా హీరో. ఇప్పుడు నా OG. హ్యాపీ బర్త్‌డే సార్” అంటూ సుజీత్ భావోద్వేగంగా పోస్ట్ చేశారు.
OG యూనివర్స్‌పై భారీ అంచనాలు
ఆజాద్ హింద్ ఫౌజ్ నేపథ్య అంశాలు, సమకాలీన కథనం, సమురాయ్ ఎలిమెంట్స్, థమన్ మ్యూజిక్‌తో వచ్చిన ఈ స్పెషల్ వీడియో OG Universeపై అభిమానుల్లో అంచనాలను మరింత పెంచింది.
