Nani to Meet 10,000 Fans Ahead of The Paradise Release

D News: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’పై అంచనాలు భారీగా ఉన్నాయి. సెప్టెంబర్ 24న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. సెప్టెంబర్ 23 నుంచే తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక షోలు ప్రారంభం కానున్నాయి.

ఇప్పటికే సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ లభించింది. దాదాపు 2 గంటల 49 నిమిషాల రన్‌టైమ్‌తో సినిమా థియేటర్లలోకి రానుంది. మరోవైపు విడుదలైన ‘ఆయా షేర్’, ‘ఏషనాగుల’ పాటలకు మంచి స్పందన వస్తోంది.

10 వేల మంది ఫ్యాన్స్‌తో నాని మీట్

సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లో ‘ది ప్యారడైజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం నాని ఏకంగా 10 వేల మంది అభిమానులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఈ కార్యక్రమానికి హాజరుకానుండగా.. వారికి వెజ్, నాన్‌వెజ్ భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు సమాచారం.

ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి..

‘ది ప్యారడైజ్’కు ప్రత్యేకంగా ట్రైలర్ విడుదల చేయకుండా నేరుగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నాని గతంలో వెల్లడించారు. కథ, కంటెంట్‌పై నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించగా.. మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. కీర్తి సురేశ్ ‘ఏషనాగుల’ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

By Avinash