Naga Vamsi Gives Big Clarity on Adarsha Kutumbam Release Date

D News: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న **‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’**పై నెలకొన్న రిలీజ్ డౌట్స్‌కు నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఫుల్‌స్టాప్ పెట్టారు. సినిమా విడుదల తేదీ విషయంలో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్ 9న ఈ సినిమా థియేటర్లలోకి రావడం ఖాయమని తేల్చిచెప్పారు.

రిలీజ్ డేట్‌పై ఫుల్ క్లారిటీ

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో గతంలో చోటుచేసుకున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని అభిమానుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నాగవంశీ సోషల్ మీడియాలో సరదాగా స్పందించారు. “మా రిలీజ్ పంక్చువాలిటీపై మీకు డౌట్స్ ఉండొచ్చు.. కానీ ఈసారి అలాంటి అనుమానాలేమీ వద్దు.

Naga Vamsi Gives Big Clarity on Adarsha Kutumbam Release Date

.అక్టోబర్ 9న వస్తున్నాం. ఇందులో ఎలాంటి మార్పు లేదు” అంటూ క్లారిటీ ఇచ్చారు.

అక్టోబర్ 6న ట్రైలర్.. 7 నుంచి బుకింగ్స్

సినిమా ప్రమోషన్స్‌కు సంబంధించి కూడా నాగవంశీ కీలక వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 6న ట్రైలర్ లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. ఇక అక్టోబర్ 7 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో ఈ సినిమాకు ఎలాంటి ప్రీమియర్ షోలు ఉండవని నిర్మాత స్పష్టం చేశారు. ప్రేక్షకులంతా అక్టోబర్ 9న నేరుగా థియేటర్లలో సినిమాను చూడాలని ఆయన కోరారు.

వెంకీ-త్రివిక్రమ్ కాంబోపై భారీ అంచనాలు

వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, వెన్నెల కిశోర్, సత్య, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘నారాయణమ్మ’ పాటకు మంచి స్పందన రావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

గతంలో వాయిదా పడిన ఈ సినిమా ప్రస్తుతం అక్టోబర్ 9, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా అప్‌డేట్‌తో రిలీజ్‌పై ఉన్న సందేహాలకు నాగవంశీ క్లారిటీ ఇచ్చినట్లైంది.

By Avinash