Misconduct in Tirumala: 'Kissing' photoshoot in front of the temple (DTv Telangana)

DNews: Jan29:ఏపీలోని కూటమి ప్రభుత్వ హయాంలో తిరుమలలో వరుస అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. టీటీడీ భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తిరుమలలో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయం పరిసరాల్లో కొత్త జంట ఫోటో షూట్ చేయడం వివాదానికి దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వివరాల ప్రకారం.. తిరుమలలోని శ్రీవారి ఆలయం పరిసరాల్లో కొత్త జంట ఫోటో షూట్ తీసుకున్నారు. గొల్లమండపం నుండి అఖిలాండం వరకు నిబంధనలకు విరుద్ధంగా ఆ జంట వివిధ భంగిమల్లో ఫోటోలు తీసుకున్నారు. ముద్దులు కూడా చేసుకున్నారు. ఈ జంట ఇలా ఫోటోలు, వీడియోలు తీయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో ఫోటో షూట్‌లు, రీల్స్‌పై నిషేధం ఉన్నప్పటికీ, భద్రతా సిబ్బంది ఉదాసీనంగా ఉండటం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు టీటీడీ భద్రతా సిబ్బందిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana