
DNews: Nov28: కోరిక తీర్చాలని మంత్రి సంధ్యారాణి కొడుకు ఫృధ్వీ, పీఏ సతీశ్ వేధింపులకు గురి చేస్తున్నారని బాధిత యువతి తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో.. ఆమె మహిళా సంఘాలతో కలిసి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో బాధిత యువతి మాట్లాడుతూ.. ‘మంత్రి సంధ్యారాణి కొడుకు, పీఏ సతీశ్ వేధిస్తున్నారు. నువ్వంటే టీడీపీలో చాలామంది నాయకులు పడిఛస్తున్నారు. వాళ్లతో గడుపు. సహకరించకపోతే ఉద్యోగం చేయనీయను’ భర్త చనిపోయిన బాధలో ఉండి గుండెజబ్బు బాధితురాలైన కుమార్తెతో జీవనం సాగిస్తున్న ఓ మహిళకు మంత్రి అనధికార పీఏ వేధింపులు ఇవి. పీఏ మీద ఫిర్యాదు చేస్తే మంత్రి కూడా అతనికే సపోర్ట్ చేసి నన్ను 30 మందితో దూషించారు’ అని అన్నారు.
