D News: Nov 2: కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో అక్టోబర్ 31న మెగా జాబ్ ఫెయిర్

శాతవాహన విశ్వవిద్యాలయం, నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 31న వర్సిటీ ప్రాంగణంలో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు శాతవాహన వర్సిటీ ఉపకులపతి ఆచార్య యు. ఉమేశ్ కుమార్, రిజిస్ట్రార్ ఆచార్య పి. సతీష్ కుమార్ వెల్లడించారు.

50కిపైగా ప్రముఖ కంపెనీల భాగస్వామ్యం

ఈ జాబ్ ఫెయిర్‌లో 50కిపైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

వివిధ కోర్సులు పూర్తి చేసిన వారికి అవకాశం

ఏదైనా డిగ్రీ, పీజీ, బీ ఫార్మసీ, డీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, నర్సింగ్‌తో పాటు ఇతర ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ జాబ్ ఫెయిర్‌కు అర్హులని నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *