
DNews: Dec10:అల్లూరి ఏజెన్సీలో మావోయిస్టు బ్యానర్లు కలకలం సృష్టించాయి. చాలా సంవత్సరాల తర్వాత, ఏజెన్సీలో మావోయిస్టు బ్యానర్లు కనిపించాయి. హిడ్మాకు నివాళులు అర్పిస్తూ బ్యానర్లు కనిపించాయి.. ముంచంగిపుట్టు మండలం మాకవరం పంచాయతీలోని కుమ్మిపుట్టు గ్రామం సమీపంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న చెట్టుపై మావోయిస్టు నాయకుడు హిడ్మాకు నివాళులు అర్పిస్తూ బ్యానర్లు కనిపించాయి. “అమరవీరుడు హిడ్మాకు సెల్యూట్..ఓ వీరుడా నువ్వు కన్న కల దోపిడి లేని స్వేచ్ఛ దేశం నువ్వు పోరాడిన సాయుధ పోరాటం ప్రజల గుండెల్లో చరిత్ర లేఖలాగా ఉంటుంది.” అని హెడ్మా. మడకం రాజ్ అనే మావోయిస్టుల పేర్లను అందులో పేర్కొన్నారు. కానీ.. ఈ బ్యానర్లు ఎవరి పేరు మీద విడుదల చేశారో అందులో రాయలేదు.
