
DET:NOV 03:
మలైకా అరోరా:ఎన్రిక్ కచేరీలో మిస్టరీ మ్యాన్ ఎవరు?డేటింగ్ రూమర్స్‌పై తెలుగు కథనం:
కచేరీ వేదికపై మెరుపులు:
బాలీవుడ్ హాట్ బాంబ్,నటి,వ్యాపారవేత్త మలైకా అరోరా ఇటీవల ముంబైలో జరిగిన ప్రఖ్యాత గాయకుడు ఎన్రిక్ ఇగ్లేసియాస్ సంగీత కచేరీకి హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి దేశంలోని పలువురు ప్రముఖులు వచ్చారు.అయితే,మలైకా అక్కడికి ఒక 33 ఏళ్ల యువకుడితో కలిసి రావడం,ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ,సంగీతాన్ని ఆస్వాదిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఈ వీడియోల కారణంగా,మలైకా జీవితంలో కొత్త వ్యక్తి వచ్చాడనే ప్రచారం ఊపందుకుంది.
ఆ మిస్టరీ మ్యాన్ ఎవరా?
మలైకాతో కనిపించిన ఆ యువకుడు ఎవరా అని నెటిజన్లు ఆసక్తిగా ఆరా తీస్తున్నారు.కొందరు అతన్ని మలైకాకు కొత్త బాయ్‌ఫ్రెండ్ అని ప్రచారం చేస్తుండగా,మరికొందరు మాత్రం దీనిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు.సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని కథనాల ప్రకారం,ఆ వ్యక్తి పేరు హర్ష్ మెహతా అని,అతను ఒక వజ్రాల వ్యాపారి అని అంటున్నారు.అయితే,మలైకా లేదా ఆమె ప్రతినిధులు ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అభిమానుల వాదనలు:అతడు మేనేజర్ అంట!
ఈ పుకార్లను కొట్టిపారేస్తూ,కొందరు సోషల్ మీడియా యూజర్లు,ముఖ్యంగా రెడ్డిట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలోని వారు,ఆ వ్యక్తి మలైకాకు కొత్త ప్రియుడు కాదని,అతడు ఆమె మేనేజర్ అని స్పష్టం చేస్తున్నారు.
గతంలో కూడా ఈ వ్యక్తి మలైకా ఈవెంట్లలో,షూటింగ్లలో ఆమెతో కలిసి కనిపించారని,అతనిది వృత్తిపరమైన బంధం మాత్రమేనని కొందరు వాదిస్తున్నారు.నిజానికి,అతను ఆమె పబ్లిక్ ఈవెంట్లను సమన్వయం చేసే వ్యక్తి కావచ్చని తెలుస్తోంది.
