Kriti Sanon Exposes Gender Discrimination in Bollywood, Makes Shocking Remarks on Budget Cuts and Actresses' Remuneration
Bollywood actress Kriti Sanon attends the song launch of her upcoming Indian Hindi-language romantic drama film ‘Cocktail 2’ in Mumbai on May 17, 2026. (Photo by Sujit JAISWAL / AFP)

బాలీవుడ్‌లో హీరోయిన్లకు ఇప్పటికీ సమాన ప్రాధాన్యత లభించడం లేదని నటి కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మహిళా ప్రధాన చిత్రాల విషయంలో నిర్మాతలు బడ్జెట్ కేటాయింపులు, నటీనటుల పారితోషికం విషయంలో వివక్ష చూపుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. హీరోల సినిమాలతో పోలిస్తే హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో నటించే చిత్రాలపై పెట్టుబడులు పెట్టేందుకు నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నారని వెల్లడించారు.

మహిళా ప్రధాన సినిమాలను ప్రేక్షకులు పెద్దగా ఆదరించరనే అభిప్రాయం చిత్ర పరిశ్రమలో ఇంకా కొనసాగుతోందని కృతి సనన్ పేర్కొన్నారు. సినిమా నిర్మాణ వ్యయాన్ని తగ్గించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ముందుగా హీరోయిన్ల రెమ్యునరేషన్‌పైనే కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు మహిళా ప్రధాన చిత్రాల అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయని అభిప్రాయపడ్డారు.

అయితే, సినిమాలో బలమైన కథ, ఆకట్టుకునే కథనం ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని కృతి సనన్ స్పష్టం చేశారు. అందుకు తన కెరీర్‌లో విజయవంతమైన చిత్రాలే ఉదాహరణగా నిలుస్తాయని చెప్పారు. తాను ప్రధాన పాత్రలో నటించిన ‘మిమి’ సినిమాతో పాటు టబు, కరీనా కపూర్‌లతో కలిసి నటించిన ‘క్రూ’ చిత్రం సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు.

మహిళా ప్రధాన చిత్రాలకు కూడా భారీ ఆదరణ లభించే అవకాశం ఉందని ఈ సినిమాలు నిరూపించాయని కృతి అభిప్రాయపడ్డారు. కథ, నటీనటుల ప్రతిభకు ప్రాధాన్యతనిస్తూ నిర్మాతలు ధైర్యంగా పెట్టుబడులు పెట్టాలని ఆమె సూచించారు. బాలీవుడ్‌లో హీరోయిన్లకు సమాన అవకాశాలు, పారితోషికం లభించాలంటే పరిశ్రమలో ఇప్పటికీ కొనసాగుతున్న ఈ ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *