
D News : సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి వార్తలు ఇప్పుడు సినీ, క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే నవంబర్ 21న చెన్నైలో జరగనున్న రిసెప్షన్‌కు కావ్య మారన్ తండ్రి, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ ప్రముఖులను ఆహ్వానించినట్లు వార్తలు రావడం చర్చకు దారితీసింది.
రేవంత్ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం!
కళానిధి మారన్ తన భార్య కావేరి మారన్‌తో కలిసి హైదరాబాద్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన మారన్ దంపతులు.. నవంబర్ 21న చెన్నైలో జరగనున్న రిసెప్షన్‌కు రావాలని రేవంత్ రెడ్డి దంపతులను కోరినట్లు సమాచారం.
ఆ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కూడా మారన్ దంపతులు కలిశారు. కేటీఆర్, ఆయన భార్య శైలిమను రిసెప్షన్‌కు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్నాయన్న వార్తలతో ఈ వేడుకపై ఆసక్తి మరింత పెరిగింది.
గ్రీస్‌లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్?
కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ వివాహం నవంబర్ 11న గ్రీస్‌లో జరగనుందంటూ కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక నిర్వహించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే పెళ్లి తేదీ, వేదికపై ఇప్పటివరకు ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
మరోవైపు, చెన్నైలో జరగనున్న రిసెప్షన్‌కు తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్‌తో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. పెళ్లి వార్తలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ, కావ్య మారన్–అనిరుధ్ జంట గురించి వస్తున్న ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారాయి.
