
DSports:19 Nov:IPL 2026 మినీ వేలం రానుండగా, ఫ్రాంచైజీలు తీసుకున్న కొన్ని అనూహ్య రిటెన్షన్/రిలీజ్ నిర్ణయాలు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. భారీ ధరలు పలికే, మ్యాచ్‌లను ఒంటరిగా గెలిపించే ఐదుగురు స్టార్ బ్యాట్స్‌మెన్ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
మిడిల్ ఆర్డర్లో అతని విధ్వంసక ఇన్నింగ్స్‌కి మిల్లర్ ప్రసిద్ధి. LSG అతన్ని విడుదల చేయడంతో మిల్లర్ కోసం జట్ల మధ్య పోరు ఖాయమైంది.సీఎస్కేకు అనేక మ్యాచ్‌లు గెలిపించిన కాన్వే గత సీజన్లో రాణించలేదు. దీంతో జట్టు అతన్ని విడుదల చేసింది. కాన్వే కోసం చాలా జట్లు బరిలోకి దిగే అవకాశం ఉంది.41 ఏళ్ల వయసున్నా ఫాఫ్ పేలవన్న మాటే లేదు. గత సీజన్ ఛాయలు విడవకపోవడంతో ఢిల్లీ అతన్ని విడుదల చేసింది. అయితే, అతన్ని మినీ వేలంలో మళ్లీ పెద్ద మొత్తానికి కొనుగోలు చేసే అవకాశం ఉంది.
DC గత మెగా వేలంలో 9 కోట్లకు కొనుగోలు చేసిన ఈ ఆస్ట్రేలియన్ యువ ఆటగాడు ఇప్పుడు విడుదలయ్యాడు. పవర్-హిట్టింగ్‌కి ప్రసిద్ధి చెందిన అతను మినీ వేలంలో భారీ మొత్తాన్ని ఆశించొచ్చు.గత సీజన్లో ఫామ్‌లో లేకపోయినా, డి కాక్ ఓపెనర్‌గా పెద్ద ఇన్నింగ్స్ ఆడగల ఆటగాడు. అతన్ని విడుదల చేసిన కేకేఆర్ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.ఐపీఎల్ చరిత్రలో మూడవ అత్యధిక విదేశీ సిక్సర్లు (223) బాదిన రస్సెల్ పేరు కూడా రిలీజ్ జాబితాలో ఉంది.కేకేఆర్ మినీ వేలంలో అతన్ని తిరిగి లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది.
