
D Educt: Sept 30: ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO)/మేనేజ్‌మెంట్ ట్రైనీస్ (MT) ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు సంబంధించిన మార్కులు, కటాఫ్ మార్కుల వివరాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ, క్యాప్చా వివరాలను నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి దశ అయిన మెయిన్స్ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది.
IBPS PO/MT మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 4న నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలు ఆగస్టు 22, 23 తేదీల్లో నిర్వహించారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.
కాగా, ఈ ఏడాది విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా IBPS PO/MT పోస్టుల్లో మొత్తం 7,365 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి ఎంపిక ప్రక్రియకు సిద్ధం కావాల్సి ఉంటుంది.
