
DNews: Dec 08: హైదరాబాద్‌లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సాకేత్ కాలనీలో ఫోస్టర్ బిల్లా బాంగ్ స్కూల్ సమీపంలో రియల్టర్ వెంకటరత్నం పై దారుణ హత్య జరిగింది. ఆయన బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు మరో బైక్‌పై వెంబడించి వేటకత్తితో దాడి చేశారు. ఆ తర్వాత రివాల్వర్‌తో కాల్పులు జరిపి అక్కడికక్కడే హతమార్చారు. కాల్పుల శబ్దం వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో ఒక బుల్లెట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక దర్యాప్తులో ఇది ఆర్థిక విభేదాలు లేదా పాత శత్రుత్వం కారణంగా జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను గుర్తించి పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి, హత్య వెనుక ఉన్న కారణాలను పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు.
