D News: Jul 13: ఎస్. జానకి ఆస్తులపై చర్చ.. వందల కోట్ల విలువ అంటూ ప్రచారం

సినీ పరిశ్రమలో ఆరు దశాబ్దాలకు పైగా తన మధుర గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న గానకోకిల ఎస్. జానకి పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె సుదీర్ఘ సంగీత ప్రయాణంలో సంపాదించిన ఆస్తుల విలువపై సోషల్ మీడియా, పలు మీడియా కథనాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ వివరాలపై అధికారిక ధృవీకరణ లేదు.

వివిధ మీడియా కథనాల ప్రకారం.. ఎస్. జానకి ఆస్తుల విలువ సుమారు రూ.537 కోట్లకు పైగా ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. సినిమాల్లో పాటలు పాడటంతో పాటు దేశ విదేశాల్లో నిర్వహించిన సంగీత కార్యక్రమాలు, గతంలో చేసిన రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా ఆమె ఈ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, మైసూర్ నగరాల్లో ఆమెకు విలువైన ఇళ్లు, స్థలాలు, వాణిజ్య ఆస్తులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ దాదాపు 50 వేల పాటలు పాడిన ఎస్. జానకి 2017 అక్టోబర్‌లో తన 60 ఏళ్ల గాన ప్రస్థానానికి అధికారికంగా వీడ్కోలు పలికారు. అనంతరం కర్ణాటకలోని మైసూర్‌లో ప్రశాంత జీవితం గడుపుతున్నారు. కాగా, ఆమె ఆస్తుల విలువకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, వాటిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana