D News: Jul 24: ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

వాతావరణ శాఖ వివరాల ప్రకారం, సముద్ర మట్టానికి ఉన్న రుతుపవన ద్రోణి ప్రస్తుతం జైసల్మేర్, ఆగ్నేయ రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లోని అల్పపీడన కేంద్రం, గుణ, సిద్ధి, డాల్టన్‌గంజ్ మీదుగా ఈశాన్య బంగాళాఖాతం వైపు విస్తరించింది. ఈ వ్యవస్థ ప్రభావంతో తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్, యానం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానంలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మెరుపులు సంభవించే అవకాశముండగా, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముండగా, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

రాయలసీమ ప్రాంతంలో కూడా రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే వర్షాలతో పాటు కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదయ్యే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

వర్షాలు, ఉరుములు, బలమైన గాలుల నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా పిడుగుల సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలవకుండా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana