80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా అనిపించింది.
రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం అందించే ప్రజాస్వామ్య పాలనను అందించడమే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం.మహనీయుల త్యాగాల నుంచి స్ఫూర్తి పొంది, 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం.రతుల సంక్షేమం కోసం రైతు భరోసా, రుణమాఫీ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉచిత మధ్యాహ్న భోజన పథకం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నాం.మెరుగైన వైద్య సేవల కోసం ఆధునిక సదుపాయాలతో ఆసుపత్రులను అభివృద్ధి చేయడంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తున్నాం.
మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, గృహ జ్యోతి వంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల అభ్యున్నతికి మా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోంది.

మన ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహిళా శక్తి మిషన్ ద్వారా జిల్లాలోని 2.42 లక్షల మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాం. వందల కోట్ల రూపాయల విలువైన బ్యాంకు రుణాలు, స్త్రీనిధి రుణాలను అందిస్తున్నాం.
మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బ్యాంకులు, సోలార్ ప్లాంట్లు, ఇందిరా డెయిరీ వంటి వినూత్న వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నాం.
చేయూత పెన్షన్లు, ఉపాధి హామీ పనులు, కోట్లాది రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది.

ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. 🇮🇳
