D Educt: Aug 18: TETలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. 2011 నుంచి ఇప్పటివరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TET)లో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ మీ సేవ కేంద్రాల ద్వారా ముద్రిత మెమోలను జారీ చేయాలని నిర్ణయించింది.

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ముద్రిత మెమోపై అభ్యర్థి పేరు, ఫొటో, వేలిముద్ర లేదా సంతకం, పరీక్షలో సాధించిన మార్కుల వివరాలు ఉంటాయి. వీటితో పాటు ప్రత్యేకమైన బార్‌కోడ్‌, సర్టిఫికెట్‌ నంబర్‌ను కూడా పొందుపరచనున్నారు. మెమోను పొందేందుకు అభ్యర్థులు నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

నకిలీ మెమోలకు చెక్ పెట్టేందుకే..

గతంలో TETలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రెండుసార్లు ముద్రిత మెమోలు జారీ చేశారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌ మెమోలను మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఆన్‌లైన్‌లో లభించే మెమోలను ఆధారంగా చేసుకుని కొందరు నకిలీ మెమోలు తయారు చేస్తున్నట్లు విద్యాశాఖ గుర్తించింది.

ఈ నేపథ్యంలో నకిలీ మెమోల తయారీకి అడ్డుకట్ట వేయడంతో పాటు ధ్రువీకరణ ప్రక్రియను మరింత పటిష్టం చేసేందుకు ప్రత్యేక భద్రతా లక్షణాలతో కూడిన ముద్రిత మెమోలను జారీ చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని మీ సేవ కేంద్రాల ద్వారా ఈ మెమోలు అందుబాటులోకి రానున్నాయి.

ముద్రిత మెమోలు వారం నుంచి పది రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నవీన్‌ నికోలస్‌ తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత విధానంలో మీ సేవ కేంద్రాల ద్వారా వీటిని పొందవచ్చు.

వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ యూనిట్లు

రాష్ట్రంలోని మరో వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వెల్లడించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావాన్ని పెంపొందించేందుకు ఈ యూనిట్లు దోహదపడతాయని తెలిపారు.

కొంపల్లిలోని శిక్షణ కేంద్రంలో అధునాతన వసతులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్పోర్ట్స్‌ ట్రాక్‌తో పాటు ఇతర సౌకర్యాలను కూడా కల్పిస్తున్నామని తెలిపారు. పనులు పూర్తయిన అనంతరం విద్యార్థులకు అవసరమైన శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు.

అత్యుత్తమ సేవలు అందించిన వారికి త్వరలో సన్మానం నిర్వహించనున్నట్లు నవీన్‌ నికోలస్‌ తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధితో పాటు వారిలో సేవాభావం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana