DTech 09 Oct: యుకేకు చెందిన ప్రముఖ డిజిటల్ ఫైనాన్స్ సంస్థ రెవొల్యూట్, ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న డిజిటల్ చెల్లింపుల మార్కెట్లలో ఒకటైన భారతదేశంలోకి తన ప్రవేశాన్ని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (GFF 2025)లో అధికారికంగా ప్రకటించింది. 2030 నాటికి 2 కోట్ల మంది భారతీయ వినియోగదారులను చేరుకోవడమే సంస్థ ప్రధాన లక్ష్యంగా నిర్ణయించుకుంది.

ఈ సంవత్సరం చివర్లో విడుదలకానున్న భారతీయ-కేంద్రీకృత రెవొల్యూట్ ప్లాట్‌ఫారమ్, దేశీయ మరియు అంతర్జాతీయ లావాదేవీలకు అనువుగా రూపొందించిన ఆల్-ఇన్-వన్ ఫైనాన్షియల్ యాప్‌గా అందుబాటులోకి రానుంది. ఇది యూపీఐ (UPI)తో అనుసంధానించబడిన ఉండే విధంగా, దేశీయ ప్రీపెయిడ్ వీసా కార్డులు, బహుళ కరెన్సీల అంతర్జాతీయ వీసా కార్డులను కూడా అందిస్తుంది.

ఈ సందర్భంగా రెవొల్యూట్ ఇండియా సీఈఓ పరోమా ఛటర్జీ మాట్లాడుతూ –

“ఈ రోజు రెవొల్యూట్‌కు మరియు భారత వినియోగదారులకు ఎంతో కీలకమైన ఘట్టం. భారతదేశంలోని శక్తివంతమైన చెల్లింపు వ్యవస్థను, అత్యాధునిక అంతర్జాతీయ ఖర్చు పరిష్కారాలతో కలిపి వినియోగదారులకు పూర్తి స్వేచ్ఛ మరియు నియంత్రణను అందిస్తున్నాం” అని చెప్పారు.

ప్రారంభ విడతలో, 3.5 లక్షల మంది వినియోగదారులు ఇప్పటికే వెయిట్‌లిస్ట్‌లో ఉన్నారు. రెవొల్యూట్ ప్రధానంగా దేశంలోని ఆకాంక్షగల యువతను లక్ష్యంగా చేసుకుంటోంది.

భారతీయ యాప్‌ ముఖ్య ఫీచర్లు:

  • యూపీఐ, దేశీయ మరియు అంతర్జాతీయ వీసా కార్డులతో కూడిన ప్రీపెయిడ్ వాలెట్
  • కస్టమైజ్‌ చేయగల రెవొల్యూట్ బ్రాండెడ్ UPI హ్యాండిల్స్
  • తక్కువ ధరతో అంతర్జాతీయ లావాదేవీలు
  • యాప్‌లో భద్రతా ఫీచర్లు, మోసం నివారణ, ట్రావెల్ ఇన్సూరెన్స్, బడ్జెట్ ప్లానింగ్ టూల్స్
  • పిల్లల కోసం పేరెంట్ మానిటరింగ్ ఉన్న ఖాతాలు

భారతదేశంలో డేటా సార్వభౌమత్వం నిబంధనలకు అనుగుణంగా, రెవొల్యూట్ దాని సాంకేతిక మౌలిక వసతుల స్థానికీకరణ కోసం £40 మిలియన్లకు పైగా (దాదాపు $53.7 మిలియన్లు) పెట్టుబడి పెట్టినట్లు తెలిపింది – ఇది ప్రత్యేకంగా భారత మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకునే ఒక నిర్ణయమని సంస్థ పేర్కొంది.

రెవొల్యూట్ ఇప్పటికే భారతదేశంలో ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPI) లైసెన్స్ మరియు ఫారెక్స్ సేవల కోసం అవసరమైన లైసెన్స్‌ను కూడా పొందింది. ఈ ప్రవేశం రెవొల్యూట్ యొక్క ఐదు సంవత్సరాల గ్లోబల్ వ్యూహంలో భాగం – ఇందులో £10 బిలియన్ల పెట్టుబడి, 2030 నాటికి 30కి పైగా కొత్త మార్కెట్లలో విస్తరణ, అలాగే 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల వినియోగదారులను చేరుకునే లక్ష్యంతో ఉంది.

ఈ సందర్భంగా యూకే ట్రెజరీ ఆర్థిక కార్యదర్శి లూసీ రిగ్బీ మాట్లాడుతూ –

“రెవొల్యూట్ భారతదేశంలోకి ప్రవేశించడం యూకే యొక్క గ్లోబల్ నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. వారి శక్తివంతమైన, వినూత్న వేదిక మిలియన్ల మందికి మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించనుంది – ఇది ప్రపంచ వేదికపై బ్రిటిష్ వ్యాపార పరాకాష్టిని చూపిస్తుంది” అని ప్రశంసించారు.

By Adhitya

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana